విత్తన బిల్లును ఉపసంహరించుకోవాలి
నిజామాబాద్, బతుకమ్మ : విత్తన, విద్యుత్ బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని ఆ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎస్ కే యం జిల్లా కన్వీనర్ వేల్పూర్ భూమయ్య డిమాండ్ చేశారు. మంగళ వారం ఎస్ కే యం జాతీయ కమిటీ పిలుపులో భాగంగా డిచ్ పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్న రైతులను తొలగించి, దేశ విత్తన సార్వభౌమత్వాన్ని కొన్ని బహుళజాతి సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రైతుల హక్కులను, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను...