Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 December 2025, 3:07 pm Posted by : ramakrishna

విత్తన బిల్లును ఉపసంహరించుకోవాలి

నిజామాబాద్, బతుకమ్మ : విత్తన, విద్యుత్ బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని  కేంద్ర ప్రభుత్వం చూస్తుందని ఆ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎస్ కే యం జిల్లా కన్వీనర్ వేల్పూర్ భూమయ్య డిమాండ్ చేశారు. మంగళ వారం ఎస్ కే యం జాతీయ కమిటీ పిలుపులో భాగంగా డిచ్ పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్న రైతులను తొలగించి, దేశ విత్తన సార్వభౌమత్వాన్ని కొన్ని బహుళజాతి సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందన్నారు.  రైతుల హక్కులను, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించే నిబంధనలు ఈబిల్లులో ఉన్నాయన్నారు.
భారత విద్యుత్ వ్యవస్థను పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ, వాణిజ్యీకరణ , కేంద్రీకరణ కోసం 2025 విద్యుత్ బిల్లు రూపొందించబడిందని ఆరోపించారు. ఇది అమలు చేస్తే  ప్రభుత్వ రంగంలో నడిచే విద్యుత్  సంస్థలు  నష్టాలను భరించాల్సి వస్తుందన్నారు.  కార్యక్రమంలో ఎస్ కే యం జిల్లా నాయకులు జేపీ గంగాధర్, వాసరి సాయినాథ్, గంగాదాస్,  తదితరులు పాల్గొన్నారు.