జాలరి ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
రంగంలోకి రిస్క్యూ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఉన్నతాధికారులు విషాదంలో కుటుంబ సభ్యులు బతుకమ్మ, మాచారెడ్డి: ఎగువ మానేరు వాగులో గల్లంతైన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లోని లచ్చపేట గ్రామానికి చెందిన జాలరి కైరం కొండ శివరాములు ఆచూకీ ఊహాకందకుండా పోయింది. గల్లంతై 24 గంటలు గడిచినా అతని ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆయన కుటుంబం లో విషాదం అలుముకుంది. ప్రమాదకర స్థాయిలో వాగు ప్రవహించడం తో రిస్క్యూ టీం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కనీసం శవమైన లభిస్తుందో లేదోనన్న...