Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 November 2025, 6:54 pm Posted by : ramakrishna

శ్రీరామ నామస్మరణతో మారుమోగిన సత్సంగ సదనం

  • శ్రీ రామ కోటీ  స్థూపంలో లిఖిత రామకోటిని సమర్పించుకొని  భక్తి ని చాటుకున్న  భక్తులు

 

ఎల్లారెడ్డి పేట, బతుకమ్మ: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని   సత్సంగ సధనం శ్రీశ్రీశ్రీ సరస్వతీ గోవిందా రాజుల చారిటెబుల్  ట్రస్ట్  ఆద్వర్యంలో కార్తీక ఏకాదశీ  సందర్బంగా శనివారం  శ్రీరామ  కోటి స్థూపానికి సత్సంగ సదనం అద్యక్షులు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి పత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు సంవత్సరం పొడువున రాసుకొని తెచ్చిన లిఖిత రామకోటీ ప్రతులను  అందజేయగా లక్ష్మారెడ్డి రామకోటి స్థూపం లో  సమర్పించారు. మొదట  సత్సంగ సదనం నుండి మహాత్మా గాంధీ విగ్రహం నుండి నంది విగ్రహాం వరకు అక్కడి నుండి  తిరిగి  సత్సంగ సదనం వరకు  హరే రామ హారే కృష్ణ నామంతో నగర సంకీర్తన  ఘనంగా జరిగాయి. దీంతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం హారేరామ హారేరామ నామ స్మరణతో మారుమోగింది. అనంతరం రుక్మిణి కళ్యాణముపై  హరికథను హరికథ భగవతారిని కే నాగమణి కేశవరావు  భక్తులను అలరించారు. కార్యదర్శి శ్రీనివాస్  గుప్తా భక్తులకు ఏలాంటి ఆసౌకర్యాలు  కలుగకుండా  ఏర్పాట్లను చూశారు. కరీంనగర్ గీతా మందిర్ విష్ణు సేవానంద స్వామి భగవత్ ప్రవచనం చేశారు. అనంతరం సత్సంగ సదనం సంప్రాదాయం ప్రకారం ఏకాదశీ  ఉపవాసం సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు  నిర్వహాకులు ఆల్పాహార  ఏర్పాట్లు చేశారు.నగర సంకీర్తనలో  వేములవాడ సత్సంగ సదనము నిర్వాహకులు భూపతి సార్, అయ్యప్ప గురు స్వామి  పందిర్ల  శ్రీనివాస్ గౌడ్ భక్త సంఘం ప్రతినిధులు రామ్ రెడ్డి సార్,  గుండం రాజిరెడ్డి  అనంత రెడ్డి,  కిషన్ రెడ్డి, సంజీవ్ రెడ్డి,ద్యాప దేవయ్య యాదవ్, గంప నాగేంద్రం గుప్తా బొమ్మ కంటి రాజయ్య గుప్తా ,ధర్మారావు,  నగుబోతు లక్ష్మీనారాయణ గుప్తా,  రాము గుప్తా, బండారి బాల్రెడ్డి, మేగి నరసయ్య, గన్న పద్మారెడ్డి, మహిళా ప్రతినిధులు ఆంజమ్మ  , ముప్పవరం ఉదయ లక్ష్మి,ఒగ్గు లక్ష్మి యాదవ్,మహిళా భక్తులు తదితరులు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.

The Satsang Sadan was transformed by the chanting of the name of Sri Rama.