Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 November 2025, 7:13 pm Posted by : ramakrishna

కుభ్యనాయక్ తండా సర్పంచ్ ఏకగ్రీవం

కామారెడ్డి/పిట్లం, బతుకమ్మ: రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్గల్ మండలంలోని కుభ్యనాయక్ తండాలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అయింది సర్పంచ్ గా బీసీ మహిళ గాయత్రి భర్త గోవింద్ ని తండా ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం పిట్లం మండలంలోని సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్లో డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ సన్మాన సభ కార్యక్రమానికి విచ్చేసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ని మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఏకగ్రీవంగా ఎన్నికయిన సర్పంచ్ గాయత్రి ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కుభ్యనాయక్ తండా ప్రజలు సర్పంచ్ ను ఏకగ్రీవం చేస్తూ తీర్మానం చేయడం పట్ల ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, కుభ్య నాయక్ తండ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.