. . . సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మూతపడిన ఎన్సిఎస్ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ ని తెరిపించి బెల్లం కేంద్రం గా మార్చి ప్రభుత్వమే నడిపించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ శాసనసభ్యులు పి.సుదర్శన్ రెడ్డి నివాసంలో వారిని కలిసి మెమోరాండం ఇవ్వడమైనది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ జిల్లా వాసిగా శాసనసభ్యులుగా, ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న మీరు ఈ జిల్లా రైతు కూలీల సమస్యల పరిష్కారానికి తగిన చొరవ చూపగలరని వారిని కోరారు. ఒకనాడు మంచి లాభాలతో నడిచిన ఎన్ పి ఎస్ఎఫ్ సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ వల్ల రైతులు అనేక లాభాలు గడించారాని వారి పిల్లల చదువులు, ఇండ్లు కట్టుకోవడం, పెళ్లిలు తదితర అనేక ఆర్థిక అభివృద్ధికి ఈ ఫ్యాక్టరీ తోడ్పడిందని వారన్నారు.కేంద్ర ప్రభుత్వం చక్కెర పాలసీలతో పాటు అవినీతి అధికారుల మూలంగా నష్టాల్లో కురుకపోయిందని, మూత పడిందని ఈ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించే బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీదనే ఉందని వారు కోరారు. ఈ ప్రాంతంలో 80 గ్రామాలలో రైతులందరూ చెరుకు పండించేందుకు ముందుకు వస్తున్నారని ప్రభుత్వం రైతుకు లాభసాటి ధర చెల్లిస్తామని, విత్తనము ఉచితంగా ఇస్తామని రైతులను ప్రోత్సహించవలసిన బాధ్యత మీ మీదనే ఉందని వారన్నారు. తెలంగాణలో విత్తన ఉత్పత్తికి అనుకూలమైన ఈ నేల ఉందని శాస్త్రజ్ఞులు, నిపుణులు చెబుతున్నారని అందుకు శనిగే, వేరుశెనగే, సోయా, వరి తదితర విత్తనాల తయారీకి ఈ భూమి అవకాశం ఉందని అందుకు గాను ఈ సంస్థకు తగిన నిధులు కేటాయించి విత్తనాభివృద్ధికి తోడ్పడాలని వరన్నారు.ముందుగా ఈ విత్తన అభివృద్ధి సంస్థకు గత ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై అందించిన విత్తనాల బకాయిలు సుమారు 450 కోట్ల రూపాయలు వెంటనే ప్రభుత్వం ఈ సంస్థకు ఇవ్వాలని వారు కోరారు..జిల్లాలో లక్షలాది కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని పచ్చిమేత సాగు కోసం గతంలో వెటర్నిటీ శాఖలో ఎబొ పోస్టు ఉండేదని ఈ పోస్టును అప్పటి ప్రభుత్వం రద్దు చేసిందని తిరిగి ఆ ఎడి, ఎడి స్థాయి అధికారిని నియమించలని వరన్నారు. పాడి రైతుల అభివృద్ధికి తగు చర్యలు చేపట్టాలని వరన్నారు.గ్రామీణ ప్రాంతాలలో మత్స్య కార్మికులకు తగిన విధంగా ప్రోత్సాహాలు అందించాలని చెరువులలో చేప పిల్లలను పోసిన సందర్భంలో ఒక రూపాయిలతో విత్తనం వేస్తే అది 200 రూపాయలు కిలో చేపగా అభివృద్ధి చెందుతుందని తమరు అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి అందుకుగాను మత్స్య పరిశ్రమృద్ధికి తగిన నిధులు కేటాయించాలని వారి అభివృద్ధికి తోడ్పడాలని వారు కోరారు. పులాంగ్ వాగు అభివృద్ధికి గాను మాసాని నుంచి పాల్ద, జన్నేపల్లి వరకు గల వాగును ఇరువైపులా కరకట్టలు నిర్మించిన్నట్లయితే అందులో నీటి నిలువ సామర్థ్యం పెరుగుతుంది. దీంతో పాటు ఈ మొత్తం ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి తగిన చర్యలు చేపట్టాలని, అందుకు తగిన నిధులు కేటాయించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐకెఎంఎ స్జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, నాయకులు శివకుమార్, కొట్టే గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
