పంటల క్రయవిక్రయాలను నిశితంగా పర్యవేక్షించాలి
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశం నిజామాబాద్, బతుకమ్మ : ఎర్రజొన్న, తెల్లజొన్న, పసుపు పంటల అమ్మకాలు ప్రారంభం అయినందున క్రయవిక్రయాలను నిశితంగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. పంట దిగుబడులను విక్రయించే విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రేడర్లు, సీడ్ వ్యాపారులు మార్కెట్ రేటుకు అనుగుణంగా ధరను చెల్లిస్తూ, రైతుల వద్ద నుండి పంటను సేకరించేలా చూడాలన్నారు. జొన్న, పసుపు పంటల దిగుబడులు చేతికందుతున్న...