భీంగల్, బతుకమ్మ :
భీంగల్ మున్సిపాలిటీ పై కాషాయ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కంకణ బద్దులై పని చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కానిస్టెన్సీ ఇంచార్జ్ డాక్టర్.మల్లికార్జున్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎల్ జె ఫంక్షన్ హల్లో మండల పార్టీ ప్రెసిడెంట్ అరే రవీందర్, పట్టణ అధ్యక్షులు కనికరం మధుల అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మున్సిపల్ పరిధిలోని 12 వార్డ్ ల కౌన్సిలర్లను గెలిపించుకొని, మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని ఆయన పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశం లో బీజేపీ సీనియర్ నాయకులు యోగేశ్వర నర్సయ్య, మునిగే మహిపాల్, నర్సారెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.