పోలీసు అమరులను స్మరించుకోవడం వారిని గౌరవించడమే..

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని, వారిని త్యాగాలను స్మరించుకోవడమంటే వారిని గౌరవించుకోవడమేనని జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పోలీసు అమరవీరు సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించగా అదనపు కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరై పోలీసు అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలవు తుండడంలో పోలీసులు కృషి దాగి ఉందని అన్నారు. మన పోలీసు వ్యవస్థ ఎంతో...