నందిపేట్, బతుకమ్మ : పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా నందిపేట్ పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎస్సై తో పాటు పోలీసుల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వివేకానంద చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్సై శ్యామ్ రాజ్ మాట్లాడుతూ అమరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు ప్రజల్లో చట్టాల పట్ల అవగాహన పెంపొందించేందుకు ఈ సైకిల్ ర్యాలీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. పోలీసుల త్యాగాలకు ప్రజలు ఎల్లప్పుడూ మద్దతుగా నిలవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎస్సై 2 రాము, సిబ్బంది, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.