పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి
సంస్మరణ దినోత్సవంలో ఐ.జీ, కలెక్టర్, సీపీ విధి నిర్వహణలో అసువులు బాసిన అమరులకు ఘన నివాళులు నిజామాబాద్, బతుకమ్మ : శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహరహం శ్రమిస్తూ అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటుందని మల్టీ జోస్ ఐ.జీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అన్నారు. విధి నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ, అమరులైన పోలీసులను స్మరించుకోవడం, వారి కుటుంబాల...