Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 March 2025, 1:43 pm Posted by : ramakrishna

శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

వెబ్ న్యూస్, బతుకమ్మ :  శ్రీశైలంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉగాది బ్రహోత్సవాలు గురువారం ప్రారంభమై ఈనెల 31 వరకు జరగనున్నాయి. దీంతో కర్నాటక భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే క్యూకాంప్లెక్స్ లు నిండిపోయాయి. భ్రమరాబ మల్లాకార్జున స్వామి వార్ల దర్శనం కోసం 5 గంటల సమయం పడుతోంది. శ్రీశైలంలో ఇప్పటికే 3 లక్షల మంది భక్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల చివరి వరకు రద్దీ కొనసాగే అవకాశముంది.

నేటితో ముగియనున్న శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనాలు

శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనాలకు బుధవారం రాత్రి వరకు అనుమతించనున్నారు. ఉగాది మహోత్సవాల సందర్భంగా గురువారం నుంచి ఈ నెల 31 వరకు భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతించనున్నారు.


The rush of devotees continues in Srisailam