Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 August 2024, 8:34 pm Posted by : ramakrishna

అధికార పార్టీ నేతలకు పోలీసుల గులాం గిరి

  • అర్బన్ ఎంఎల్ఏ ధన్ పాల్ సూర్య నారాయణ

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీస్ రక్షణ వ్యవస్థలో కొందరు పోలీసులు అధికార పార్టీ నేతలకు గులాం గిరి చేస్తున్నారని అర్బన్ ఎంఎల్ఏ ధన్ పాల్ సూర్య నారాయణ మండిపడ్డారు. పోలీస్ శాఖలో పని చేస్తున్న సీ ఐ ల బదిలీ ఉత్తర్వులు ఆగిపోవడం పై ఆయన శుక్రవారం ఒక విడుదల చేశారు. అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తున్న కొందరు అధికారులు ఖాకీ చొక్కా తీసి ఖద్దరు చొక్కా వేసుకోవాలని అన్నారు. నగరిలో కొందరు సీ ఐ ల పై ఎన్నో అభియోగాలు వస్తున్నా ఏళ్ల తరబడి అదే పోలీస్ స్టేషన్ లో ఉంటూ అవినీతి కి పాల్పడుతున్నారు అని ఆరోపించారు. వీరిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సీ ఐ ల బదిలీ ఉత్తర్వులు ఇచ్చి మళ్ళీ ఆపడం పై ఉన్న మతలబు ఏంటో కమిషనర్, ఐ జీ సమాధానం చెప్పాలన్నారు. గత ప్రభుత్వ హయాం లో కొందరు ఖాకీలు గులాబి కండువా కప్పుకొని కార్యకర్త గా పని చేశారని అన్నారు. కొందరు అధికారుల కారణంగా మొత్తం వ్యవస్థ కు చెడ్డ పేరు వస్తుందన్నారు. నగరంలో శాంతి భద్రతల పై, సామాన్య ప్రజలకు న్యాయం చేసే అంశాల పైన దృష్టి పెట్టాలన్నారు. రాజకీయ నాయకులకు గులాం గిరీ చేస్తానంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.