నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలి

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ప్రజలు నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. విగ్రహాల ప్రతిష్టాపన:- ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్టించరాదు. ముఖ్యంగా జనరద్దీగా ఉండే ప్రాంతాలు, పార్కులు, ఐలాండ్, ప్రభుత్వ భవనాలు లాంటి చోట్ల ఎటువంటి విగ్రహాలను ఏర్పాటు చేపట్టరాదు. విగ్రహాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆద్వర్యంలోని కమిటీ యొక్క అనుమతులు తప్పనిసరిగా...