Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 August 2025, 4:48 pm Posted by : ramakrishna

పల్లె పాలనపై ఇష్టారాజ్యం

  • ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్న పంచాయతీ కార్యదర్శులు

 

బతుకమ్మ, బిచ్కుంద : ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్న పంచాయతీ కార్యదర్శులు అనధికారికంగా విధులకు గైరాజర్ ప్రజలకు అందని పంచాయతీల సేవలు ఎండుతున్న మొక్కలు, కొరవడిన పారిశుధ్యం ప్రజలకు నిరంతరం సేవలందించిన అధికారులు విధులకు డుమ్మా కొట్టడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీ కుర్చీలలే దర్శనమిస్తున్నయి తమ సమస్యనుఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం చిన్న దేవాడ, పెద్ద దేవాడ గ్రామపంచాయతీల్లో కార్యాలయంలో అధికారులు లేక మూసిన తలుపులు దర్శనమిస్తున్న కార్యాలయం ప్రజలకు సమాధానం చెప్పే అధికారులు లేకపోవడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామపంచాయతీ అధికారులు. సిబ్బంది సమయపాలన పాటించడం లేదని గ్రామస్తు తెలిపారు. ఎప్పుడు గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చిన కాళీ కుర్చీలతో దర్శనమిస్తున్నయని  వాపోతున్నారు. గ్రామంలోని సమస్యను ఎవరికి చెప్పుకోవాలి తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామ పంచాయతీ సిబ్బంది సమయపాలన పాటించి విధంగా చర్యలు తీసుకోవాలి అని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. పంచాయతీల్లో పాలకవర్గాల పదవీకాలం ముగిసింది .పాలన పడకేసింది. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ కొరవడి ప్రగతి కుంటుపడింది. నిత్యం విధుల్లో ఉండాల్సిన కార్యదర్శులు చాలామంది గైర్హాజరవుతున్నారు. నిబంధనల మేరకు ఉదయాన్నే పంచాయతీ వద్దకు చేరుకొని డిఎస్ఆర్ యాప్ లో హాజరు నమోదుకు ఫోటో తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అయితే విధుల్లో చేరకుండానే పాత ఫోటోలు, లేదంటే పంచాయతీ కార్యాలయ కుర్చీల చిత్రాలు పెట్టి డుమ్మ కొడుతున్నారు.

  • కీలక సమయంలో నిర్లక్ష్యం..

మండలంలో 26 గ్రామ పంచాయతీలకు గాను 23 మంది కార్యదర్శులు పని చేస్తున్నారు ఇందులో విధులకు చేరకుండానే డుమ్మా కొడుతున్న వారి సంఖ్య గణనీయంగా ఉందని ఆయా గ్రామాల ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యనిస్తున్నారు.  ఇటీవల బుగ్గారం మండలం చంద్రయ్య పల్లె కార్యదర్శి రాజయ్య యాప్ లో సీఎం ఫోటోలు పెట్టి అప్లోడ్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చాని అంశమైంది. మిగతా కార్యదర్శులకు నోటీసులు జారీ చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ  పారిశుద్ధ్య కార్యక్రమాలు సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కీలక సమయంలో నిర్లక్ష్యం వహిస్తుండడంపై ఉన్నత స్థాయి అధికారులు సైతం గుర్రమంటున్నారు.

  • గ్రామాలకు రాని ప్రత్యేక అధికారులు..

పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించారు. కాగా వారు నెలలో కనీసం ఒకటి రెండు సార్లు కూడా పల్లెల గడప తొక్కడం లేదు. వివిధ పనులకు సంబంధించి సంతకాలు కోసం కార్యదర్శులు ప్రత్యేక అధికారుల వద్దకు వెళ్లి తీసుకోవాల్సి వస్తుంది. ఎమ్మెల్యే, మంత్రులు, కలెక్టర్ ల పర్యవేక్షణ ఉంటేనే ప్రత్యేక అధికారులు పల్లెల్లో కాలు పెడుతున్నారు. తప్పనిసరిగా పంచాయతీకి వెళ్లి అభివృద్ధిపై సమీక్ష నిర్వహించాలన్న కలెక్టర్, డిపిఓ ఆదేశాలు అమలు కావడం లేదు ఇప్పటికైనా పల్లె పాలనపై జిల్లా యంత్రాంగం దృష్టి సారిస్తేనే విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరు మరియుపారిశుద్ధ నిర్వహణ తాగునీటి సరఫరా మెరుగయ్యే అవకాశం ఉంది.

The rule of law in rural areas