Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 January 2025, 11:33 pm Posted by : ramakrishna

వృద్ధుని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నుండి బోధన్ వస్తున్న ఆర్టీసీ బస్సు అర్సపల్లి లో గల నిజాం ప్యాలెస్ వద్ద బోధన్ డిపోకు చెందిన ఏపీ 25 జడ్ 0064 బస్సు గురువారం రాత్రి ఒక వృద్ధుడిని ఢీకొట్టడంతో ఆ వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో వృద్ధుడి తలకి గాయమై రక్తస్రావం ఏర్పడింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

The RTC bus hit the old man