లక్ష డప్పులు.. వేయి గొంతుకలులో యువకుల పాత్ర పెంచాలి

బతుకమ్మ, నాగరెడ్డిపేట : లక్ష డప్పులు, వేయి గొంతులు కార్యక్రమంలో మాదిగ యువకుల పాత్ర ఎక్కువగా ఉండేలా చూడాలని ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు కుంటోల్ల యాదయ్య, నాయకులు కంతి పద్మారావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు సట్టిగారి లక్ష్మి లు అన్నారు. సోమవారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో లక్ష డప్పులు వెయ్యి గొంతుల సన్నహ కళా ప్రదర్శనను నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీ నల్ల పోచమ్మ ఆలయము నుండి పెట్రోల్ పంపు మీదగా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి...