Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 January 2025, 6:57 pm Posted by : ramakrishna

లక్ష డప్పులు.. వేయి గొంతుకలులో యువకుల పాత్ర పెంచాలి

బతుకమ్మ, నాగరెడ్డిపేట : లక్ష డప్పులు, వేయి గొంతులు కార్యక్రమంలో మాదిగ యువకుల పాత్ర ఎక్కువగా ఉండేలా చూడాలని ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు కుంటోల్ల యాదయ్య, నాయకులు కంతి పద్మారావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు సట్టిగారి లక్ష్మి లు అన్నారు. సోమవారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో లక్ష డప్పులు వెయ్యి గొంతుల సన్నహ కళా ప్రదర్శనను నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీ నల్ల పోచమ్మ ఆలయము నుండి పెట్రోల్ పంపు మీదగా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ రావు కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబ్బులకు, డప్పులకు జరుగుతున్న పోరులో తాడోపేడో తేల్చుకునేందుకే ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ  వెయ్యి గొంతులు, లక్ష డప్పుల కార్యక్రమాన్ని ఫిబ్రవరి 7న  ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఎమ్మార్పీఎస్ కార్యకర్తపై ఉందని అన్నారు. ఈ నెల 25న  కామారెడ్డి జిల్లాకు మందకృష్ణ మాదిగ రానున్నారని దానికి తగిన ఏర్పాట్లు చేసుకొని తరలి రావాలని కోరారు. లక్ష డప్పులు వెయ్యి గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గ్రామ గ్రామాలలో మాదిగలు చైతన్యవంతం కావాలని సూచించారు. లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమానికి ప్రతి ఒకరు భుజానికి ఒక డప్పు వేసుకొని సమావేశానికి హాజరై విజయవంతం చేయాలన్నారు. మాదిగ మాదిగ ఉపకులాలను సైతం కదిలించే విధంగా ముఖ్య నాయకులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని బాధ్యతలు తీసుకొని ఉప కులాలను సైతం బలోపేతం చేసే విధంగా కృషి చేయాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు తొండ సాయిలు, నాయకులు ఆత్మకూరి బాబురావు, దాసరి సాయిలు. ఎల్లమ్మల శ్రీను, మండల అధికార ప్రతినిధి లింగమ్మోళ్ల ఊషయ్య, రాజు పెంటయ్య, బాలుగళ్ల సంజీవులు.జగ్గని సంజీవులు,చిందు కళాకారుడు ప్రవీణ్ ఆయా గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

The role of youth should be increased in a million drums.. a thousand voices