మోర్తాడ్, బతుకమ్మ: భారత స్థూల జాతీయోత్పత్తి వృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పెద్దన్న అన్నారు. రెండు రోజుల వర్క్ షాప్ ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులలో ఆర్థిక విద్య, మార్కెట్లు, పెట్టుబడులు వ్యవస్థ పట్ల అవగాహన కల్పించారు. సెబి సెక్యూరిటీ మార్కెట్ ట్రైనర్ డాక్టర్ బాలచంద్ర రెండు రోజులుగా మార్కెట్లో పెట్టుబడును డీమర్ట్ అకౌంటు పరిశ్రామిక అవకాశాలు నికర ఆస్తులు విలువలు మదింపులు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు కులాకశంగా విద్యార్థులకు బోధించారు. వీరిని ప్రిన్సిపల్ స్టాఫ్ ఘనంగా సన్మానించారు. పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు మెయిల్ లో అందించబడతాయన్నారు. ఎన్ ఐ ఎస్ ఎం జి కోటక్ సెక్యూరిటీస్ సెబి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ సెక్యూరిటీ మార్కెట్లో మానవ వనరుల వృద్ధి చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మర్రిపల్లి భూపతి, ఏ ఈ కోఆర్డినేటర్ డాక్టర్ యు. దశరథ్, అసిస్టెంట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీమతి డాక్టర్ అవంతి, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
