నార్కొటిక్స్, ఎయిడ్స్ నియంత్రణలో యువత పాత్ర కీలకం
గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డా.రామ్ మోహన్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నార్కొటిక్స్, ఎయిడ్స్ నియంత్రణలో యువత పాత్ర కీలకం అని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డా.రామ్ మోహన్ రెడ్డి అన్నారు. నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో శుక్రవారం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో యువతలో మాదకద్రవ్యాల దుర్వనియోగం, నివారణ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బోర్డు వారు రూపొందించిన గోడప్రతులను అవిష్కరించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డా.రామ్ మోహన్ రెడ్డి మాట్లాడారు. నార్కొటిక్స్...