Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 November 2024, 3:53 pm Posted by : ramakrishna

నార్కొటిక్స్, ఎయిడ్స్ నియంత్రణలో యువత పాత్ర కీలకం

  • గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డా.రామ్ మోహన్ రెడ్డి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నార్కొటిక్స్, ఎయిడ్స్ నియంత్రణలో యువత పాత్ర కీలకం అని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డా.రామ్ మోహన్ రెడ్డి అన్నారు. నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో శుక్రవారం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో యువతలో మాదకద్రవ్యాల దుర్వనియోగం, నివారణ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బోర్డు వారు రూపొందించిన గోడప్రతులను అవిష్కరించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డా.రామ్ మోహన్ రెడ్డి మాట్లాడారు. నార్కొటిక్స్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలని సూచించారు. నార్కొటిక్స్ రహిత సమాజంగా మార్చడానికి విద్యార్థులు సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

The role of youth is crucial in the control of narcotics and AIDS

అదేవిధంగా ఎవరైనా డ్రగ్స్  సేవించిన లేదా అమ్మిన టోల్ ఫ్రీ నంబర్ 1908కు సమాచారం అందించాలని అన్నారు. సమాచారం అందించిన వివరాలు గోప్యంగా ఉంతుతారని తెలిపారు. సమాజంలో మరోక అనర్థమైన  ఎయిడ్స్ గురించి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా.అబ్దుల్ రఫిక్ మాట్లాడుడూ ఎయిడ్స్  నివారణకు విద్యార్థులందరూ స్వియ అవగాహనతో పాటు సమాజాన్ని చైతన్య పరచాలని తెలిపారు. సరైన మార్గంలో జీవించడం ద్వారా ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించవచ్చని తెలిపారు. అనంతరం ఎన్ఎస్ఎస్  వాలంటీర్లు, విద్యార్థులతో దుబ్బకాలనీలోని వీధుల  గుండా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు  డా.జే.గంగాధర్, డా.దండు స్వామి, డా.అజయ్, గంగాధర్, రాజేశ్వర్, సంపత్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డా.వెంకటరమణ, సుధాకర్ రావు, నాగజ్యోతి, నరేష్ కుమార్, దస్తప్ప, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

The role of youth is crucial in the control of narcotics and AIDS