. . . ఏసీపీ శ్రీనివాస్
రుద్రూర్, బతుకమ్మ :
సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని బోధన్ ఎసిపి శ్రీనివాస్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో సోమవారం బోధన్ ఏసిపి శ్రీనివాస్ మహిళా కానిస్టేబుల్ లను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, వారికి గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సాయన్న, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.