Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 January 2025, 5:40 pm Posted by : ramakrishna

భావి భారత నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

  • ఆర్మూర్ ఆర్డీవో రాజా గౌడ్

 

ఇందూర్, బతుకమ్మ: భావిభారత పౌరుల నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆర్డీఓ రాజగౌడ్ సూచించారు. ఆర్డీవో కార్యాలయంలో డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆర్మూర్ శాఖ ఆధ్వర్యంలో ఆర్డీవో రాజా గౌడ్, మండల విద్యాశాఖ అధికారి రాజగంగారం చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలను అందించాలని, మంచి పౌరులుగా ఎదిగేలా ప్రోత్సహించాలన్నారు. మండల విద్యాశాఖ అధికారి రాజా గంగారం మాట్లాడుతూ పాఠశాలలు గుణాత్మక విద్యకు నిలయాలని విద్యార్థుల ఎదుగుదలకు, సమ సమాజ నిర్మాతలుగా తయారు చేయడానికి ఉపాధ్యాయులు వృత్తి నిబద్ధతతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎం. బాలయ్య, ఉపాధ్యక్షులు రాసరి పెంటన్న , పి. దాసు, రాష్ట్ర కౌన్సిలర్ విజయకుమార్, డిటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఏక్ నాథ్, మదర్ తదితరులు పాల్గొన్నారు.