భూ భారతిలో సర్వేయర్ల పాత్ర కీలకం

శిక్షణ పొంది రైతులకు సేవలందించాలి లైసెన్స్డ్‌ సర్వేయర్ల శిక్షణ తరగతుల్లో నిజామాబాద్‌ కలెక్టర్‌ టి.వినయ్‌ కృష్ణారెడ్డి బతుకమ్మ, నిజామాబాద్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం అమలులో లైసెన్స్డ్‌ సర్వేయర్ల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్‌ టి.వినయ్‌ కృష్ణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లైసెన్స్డ్‌ సర్వేయర్ల కోసం ఎంపికైన అభ్యర్థులకు అందిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్‌ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అనుభవజ్ఞుల ద్వారా అందిస్తున్న సర్వే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు....