. . . సర్పంచులకు ఘనంగా ఆత్మీయ సన్మానం
. . . సర్పంచ్ ల విధుల పట్ల అవగాహన
ఇందల్వాయి, బతుకమ్మ:
ఇందల్వాయి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఇందల్వాయి మండలానికి చెందిన నూతనంగా ఎన్నికైన సర్పంచులకు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు ఆధ్వర్యంలో సర్పంచ్లకు ఘనంగా ఆత్మీయ సన్మాన సభను నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో అనంతరావు మాట్లాడుతూ గ్రామాలలో సర్పంచ్ల పాత్రనే కీలకమని సర్పంచులకు సూచించారు, ప్రభుత్వాల నుండి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు,14వ ఆర్థిక సంఘం నిధులు ఏ విధంగా గ్రామాలకు అభివృద్ధికి ఖర్చు చేయాలో క్లుప్తంగా వివరించి తెలిపారు. గ్రామాలలో ముఖ్యంగా వీధిలైట్లు, త్రాగునీరు,డ్రైనేజీ వ్యవస్థ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ సమస్యలను పరిష్కరిస్తూ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.అలాగే సర్పంచులు,ఉపసర్పంచులు, వార్డ్ మెంబర్లు ఏకతాటిగా కలిసి గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు సుదర్శన్ నాయక్, సర్పంచులు,తహసిల్దార్ వెంకటరావు,ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ బాట్ ఐకెపి ఎపిఎం,తదితరులు పాల్గొన్నారు.