ప్రధానోపాధ్యాయుల పాత్ర కీలకం
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలలలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం లో ప్రధానోపాధ్యా యులు కీలక పాత్ర వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐదు రోజులపాటు నిర్వహించనున్న జిల్లాస్థాయి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రధానోపాధ్యాయులు ఎప్పటికప్పుడు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంటూ నూతన బోధనా పద్ధతులను మెరుగుపరుచుకుంటూ ఉపాధ్యాయులను...