- రిజిస్ట్రార్ ప్రొఫెసర్. ఎం. యాదగిరి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీలో లా కాలేజీలో యునైటెడ్ స్టేట్స్ ఇమైగ్రేషన్ సిస్టం అండ్ ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా అనే అంశంపై విస్తృత ఉపన్యాసాన్ని డాక్టర్ జెట్లింగ్ ఎల్లోసా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఏం యాదగిరి మాట్లాడుతూ గ్రామీణ స్థాయి ఉన్నతమైన లక్ష్యాలతో మహోన్నతంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వక్తలు గ్రామీణ స్థాయి నుండి జీవితాన్ని ప్రారంభించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం మన అందరికీ గొప్ప ప్రేరణగా నిలిచినారన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయ విద్యార్థులు మహోన్నతంగా ఎదగాలన్నారు. న్యాయ శాస్త్రానికి అంతర్జాతీయంగా గొప్ప గుర్తింపు ఉందని గుర్తు చేసారు. ప్రధాన వక్తగా డా శ్రీనివాస్ రావు కావేటి,సోలిసిటర్ ఇంగ్లాండ్ వాల్స్ (న్యూ యర్క్, యునైటెడ్ స్టేట్స్) హాజరై విస్తృతంగా ఉపన్యసించారు. అంతర్జాతీయంగా భారతీయులకు న్యాయవిభాగంలో గొప్ప గుర్తింపు ఉందన్నారు. ఇటీవల అంతర్జాతీయంగా సాఫ్ట్వేర్ రంగంలో అత్యధిక విడాకులు జరుగుతున్నాయన్నారు. అన్ని రకాల వృత్తుల వారు అంతర్జాతీయంగా వలస వెళుతున్నారన్నారు. వలసల కారణంగా అనేక వివాదాలు తలెత్తుతున్నాయి అన్నారు. వాటిని పరిష్కరించడానికి న్యాయ శాస్త్ర అవగాహన విస్తృతంగా ఉండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా రూల్ ఆఫ్ లా అమలు జరగడం లేదన్నారు. గ్లోబల్ ఇఆర్టి సొల్యూషన్స్ డైరెక్టర్ డా.ఉత్తం మాట్లాడుతూ అంతర్జాతీయంగా అనేకమందికి ప్లేస్మెంట్ అవకాశం ఉందన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయాల విద్యార్థులు కూడా ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసన్న రాణి, హెడ్ అండ్ ప్రిన్సిపల్, డాక్టర్ బి. స్రవంతి, బిఓఎస్, డాక్టర్ ఎం. నాగజ్యోతి, లా ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
