- రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీలో శాస్త్ర విద్యార్థుల చివరి సంవత్సరంలో ప్రత్యక్ష అనుభవం కోసం న్యాయ కళాశాలలో ఈరోజు మూట్ కోర్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రో.ఎం.యాదగిరి సందర్శించి మాట్లాడుతూ శాస్త్ర విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో న్యాయ శాస్త్రం పాత్ర ప్రతిష్టాత్మకమైనదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి నిజామాబాద్ న్యాయవాది జై వెంకటేశ్వర్లు న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో 103 అధికరణ ఎకనామికల్లి వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్స్ అంశం పై అవగాహనకల్పించారు. అనంతరం జరిగిన వాద ప్రతివాదనలలో సగం మంది విద్యార్థులు రిజర్వేషన్స్ అనుకూలంగా మరియు సగం మంది విద్యార్థులు ప్రతికూలంగా వాదించుకున్నారు. అనంతరం న్యాయమూర్తి భారతదేశంలో ఎకనామికల్లి వీకర్ సెక్షన్ కు రిజర్వేషన్ అనివార్యంగా కొనసాగించాలని తీర్మానించారు. ఈ మూట్ కోర్టు నిర్వహణ కార్యక్రమంలో డాక్టర్ బి. స్రవంతి, బిఓఎస్, డాక్టర్ ఎం. నాగజ్యోతి, లా ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.