Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 September 2025, 4:52 pm Posted by : ramakrishna

ప్రత్యేక రాష్ట్రసాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకం

  • ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

 

మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ మండల కేంద్రంలో జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన కార్యవర్గ సన్మాన సభ కార్యక్రమంలో బుధవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. సమాజానికి అవసరమైన సమాచారాన్ని ప్రజలకు అందించడంలో, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, అలాగే అభివృద్ధి, సామాజిక సంక్షేమ పథకాలకు కాపలాదారులుగా నిలవడంలో జర్నలిస్టుల పాత్ర చాలా ముఖ్యమైనదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సందూర్ వార్ హన్మండ్లు,  ఉపాధ్యక్షులు శివాజీ అప్పా, ప్రధాన కార్యదర్శి బాలాజీ, కార్యదర్శి ఆకుల పాండు, కోశాధికారి నగేష్  పాలేకర్ లను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులు తదితరులు ఉన్నారు.