. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
పోలీస్ శాఖలో ప్రతి సిబ్బంది పాత్ర అత్యంత ముఖ్యమని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్ పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ లో కోర్ట్ డ్యూటీ విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ కోర్ట్ డ్యూటీ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది కూడా సమర్థవంతంగా పనిచేయడంలో కీలక భూమిక వహిస్తున్నారని తెలిపారు. విధుల్లో నిబద్ధత, క్రమ శిక్షణ, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని, అప్పగించిన బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించారు. ప్రజలకు న్యాయం, భద్రత కల్పించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, కేసుల పరిష్కారం త్వరిత గతిగా ముగిసేటట్లుగా తోడ్పడి, సాక్షులను ప్రవేశపెట్టి, నేరస్తులకు శిక్షపడేటట్లు, పోలీసు శాఖ ప్రతిష్ఠను పెంచే విధంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని పోలీస్ కమిషనర్ కోర్టు సిబ్బందికి ఆదేశించినారు. అలాగే వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో సి.సి.ఆర్బి, సి.ఐ లు రమేష్, అంజయ్య, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ శ్యామ్ కుమార్, సి.సి.ఆర్బి సిబ్బంది, కోర్ట్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
