సమాజంలో వైద్యుల పాత్ర కీలకం
మద్నూర్, బతుకమ్మ : మండల కేంద్రంలోని వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం డాక్టర్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ థడ్కేను సిబ్బంది ఘనంగా సన్మానించారు. సమాజంలో వైద్యుల పాత్ర కీలకమైనదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నర్సులు శిల్పా మయురి, లలిత, కంపౌండర్ ఖలీమ్, గణేష్, రాజు, నాగేష్ సిబ్బంది పాల్గొన్నారు.