Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 January 2026, 5:12 pm Posted by : ramakrishna

పతంగులు ఎగురవేసిన పోచారం

బాన్సువాడ, బతుకమ్మ :

 

సంక్రాంతి పండుగ సంబరాలలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని వీక్లీ మార్కెట్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ ( పతంగుల పండుగ ) నిర్వహించారు. బుధవారం జరిగిన కైట్ ఫెస్టివల్ లో పట్టణ వాసులు, చిన్నారులతో కలిసి కైట్ (పతంగి) ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి , రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు ఎగురవేశారు. ఈ సందర్భంగా అందర్నీ ఉత్తేజ పరిచి యువతలో పిల్లలలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం బాన్సువాడ నుంచి పండరి పూర్ కు పాదయాత్ర గా వెళ్ళుతున్న భక్తుల బృందానికి ఈరోజు పట్టణంలోని పాత బాన్సువాడ హనుమాన్ మందిర్ వద్ద జెండా ఊపి పోచారం , బాలరాజు లు ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, చిన్నారులు పాల్గొన్నారు.

 

The ritual of flying kites
The ritual of flying kites
The ritual of flying kites
The ritual of flying kites
The ritual of flying kites
The ritual of flying kites