చలికాలం గుండె సంబంధిత వ్యాధుల బారినపడే ఆస్కారం ఎక్కువ

ప్రముఖ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్ జగదీష్ చంద్రబోస్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : చలికాలంలో చిన్న,పెద్ద అని తేడా లేకుండా గుండె సంబంధిత వ్యాధుల భారిన పడుతున్నారని మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జగదీష్ చంద్రబోస్ పేర్కొన్నారు. వాతావరణంలో చలి తీవ్రతలో మార్పులు వచ్చినప్పుడు రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల రక్తపోటు పెరగడం, హృదయంపై ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు ప్రధాన కారణాలని తెలిపారు. ముఖ్యంగా తెల్లవారుజామున చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో గుండె పోటు వచ్చే ఆస్కారం ఎక్కువగా ...