.. . . చలికాలం గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే శరీరాన్ని వెచ్చగా ఉండాలి
. . . చల్లని వాతావరణంలో బయటకు వెళ్లడం తీవ్రమైన శారీరక శ్రమ ప్రమాదకరం
. . . మెడికవర్ హాస్పిటల్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సందీప్ రావు
నిజామాబాద్, బతుకమ్మ :
చలికాలంలో గుండె వ్యాధుల బారిన పడే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సందీప్ రావు పేర్కొన్నారు… ఎక్కువగా యుక్త వయసులో ఉన్న యువత ఈ గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు… సరైన ఆహారపు అలవాట్లు తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని సమాజంలో తమ వంతు బాధ్యతగా సూచిస్తున్నట్లు తెలిపారు.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ లో చలి తీవ్రత వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని ప్రజలు తమ వంతు బాధ్యతగా అవగాహన కల్పించే దిశగా కృషి చేస్తున్నామని గుండె వైద్య నిపుణులు డాక్టర్ సందీప్ రావు తెలిపారు.. ఒక్క సారిగా వాతావరణంలో మార్పులు రావడంతో చలి తీవ్రత ఎక్కువగా పెరగడంతో రక్త ప్రసరణలో ,శరీర అవయవాల్లో రక్తప్రసరణ లో మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు బారిన యుక్త వయసులో ఉన్న యువకులతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడినవారు గుండె పోటుకు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ద్వారా తెలుస్తుందన్నారు.. ఎక్కువగా చలికాలం మొదలైన తర్వాత ఇప్ప వయసులో ఉన్నవారు బిపి బ్లడ్ ప్రెషర్ రక్తనాళాల్లో కొవ్వు సమస్య తలెత్తడం అలాగే హిమోగ్లోబిన్ ప్లేట్ లైట్లు రక్తస్రావం సమస్యలు చెమటలు అలసట లాంటి లక్షణాలు కనబడితే నిర్లక్ష్యం వహించకుండా వైద్యులను సంప్రదించి వైద్యుల సలహాలు సూచనలు పాటించాలని సూచించారు. చాలావరకు గుండెపోటు అనేది ఆకస్మికంగా ఒక్క శాతం మాత్రమే వస్తుందని మిగిలిన గుండెపోటు వచ్చే సమయంలో రెండు మూడు నెలల ముందు నుంచి రకరకాల అనారోగ్య సమస్యలు అలసట దమ్ము చెమటలు రావడం శరీరంలో వీక్నెస్ ఉడాసిటీ ఒత్తిడి ఇలాంటి లక్షణాలు కనబడతాయని తెలిపారు.. అలాగే ఒకప్పుడు చేసే మొరటు పని అనేది లేకుండా కేవలం శరీరంలో రక్తనాళాలు శరీరం కదలకుండా పనులు చేయడము సరైన యోగ వ్యాయామం లాంటివి చేయకపోవడం ద్వారా రక్తనాళాల్లో సమస్యలు తలెత్తి ఈ గుండెపోటు వ్యాధిని భాదనపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎక్కువగా 20 ఏళ్ల వయసు ఆ సమయంలో వారు అనవసరమైన ఫుడ్ తినడము ఆల్కహాల్ సిగరెట్టు బేకరీ ఫుడ్ ఇలాంటి చేసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి ఉన్నవారు సైతం సరైన జాగ్రత్తలు పాటించినప్పటికీ చాలావరకు 70 నుండి 80 ఏళ్ల వరకు ప్రశాంత ప్రశాంతంగా ఇలాంటి గుండె సంబంధిత వ్యాధులు బారిన పడకుండా ఉండే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.. వైద్యులు ఒక ఆరోగ్య పరీక్ష చేస్తున్నారంటే కచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది కానీ వైద్యులపై అపోహలు వీడి ఎప్పటికప్పుడు వారాల తరబడి అనారోగ్య సమస్యలు కనబడినప్పుడు వైద్యున్ని సంప్రదించి తగు వైద్యం చేయించుకోవాలని సూచించారు.. అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికా గాని జపాన్ ఇంకా ఏ దేశమైనా గాని గతంలో పురాతన కాలంలో ఉన్న వైద్యాన్ని పాటించినప్పటికీ ఆరోగ్యం తరహా పాటు వ్యాయామంతో పాటు తగు ఆహారపు అలవాట్లు మార్చుకొని ఆరోగ్యంగా జీవితాన్ని గడుపుతున్నారని తెలిపారు.. వంద సంవత్సరాలకు పైగా జీవితాన్ని గడుపుతున్నారంటే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందన్నారు..ప్రత్యేకంగా వృద్ధులు, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, స్థూలకాయం వంటి సమస్యలు ఉన్నవారు చలికాలంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఉదయం వేళల్లో ఒక్కసారిగా చల్లని వాతావరణంలో బయటకు వెళ్లడం, తీవ్రమైన శారీరక శ్రమ చేయడం ప్రమాదకరమని చెప్పారు. అలాగే పొగతాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లు గుండె ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయని హెచ్చరించారు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్ సందీప్ రావు తెలిపారు. వెచ్చని దుస్తులు ధరించడం, గోరువెచ్చని నీటిని ఉపయోగించడం, ఉప్పు మరియు కొవ్వు పదార్థాలను తగ్గించి ఆకుకూరలు, పండ్లు, ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవాలని సూచించారు. రోజూ తేలికపాటి నడక, యోగ, శ్వాస వ్యాయామాలు చేయడం గుండెకు మేలు చేస్తుందన్నారు.ఛాతిలో నొప్పి, ఎడమ చేతికి నొప్పి వ్యాపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక చెమటలు, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆసుపత్రిని సంప్రదించాలని ప్రజలకు తెలియజేశారు. మెడికవర్ హాస్పిటల్స్, నిజామాబాద్‌లో అత్యాధునిక కార్డియాక్ విభాగం ద్వారా ఈసీజీ, ఎకో, ట్రెడ్‌మిల్ టెస్ట్, యాంజియోగ్రఫీ వంటి అన్ని రకాల గుండె పరీక్షలు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ సందీప్ రావు తెలిపారు. ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండె వ్యాధులను నియంత్రించుకోవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్, నిజామాబాద్ సెంటర్ హెడ్ స్వామి, డీఎంఎస్ యజ్ఞ, మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్ ,స్వామి తదితరులు పాల్గొన్నారు.