రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకోవాలి

బంగారు భవిష్యత్ కోసం మరింత శ్రమించాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ  నిజామాబాద్, బతుకమ్మ :  భారతవని బంగారు భవిష్యత్ కోసం మరింత శ్రమించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. వి. ఎన్ భారత లక్ష్మీ అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలో శుక్రవారం 79 వ భారత స్వాతంత్య దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆమె న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. జిల్లా ప్రజలకు భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ను పౌరులు  వినియోగించుకోవాలన్నారు. ...