ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలి
. . . జాతీయ ఓటరు దినోత్సవంలో వక్తల పిలుపు . . . ఓటింగ్ లో పాల్గొని భవితను నిర్దేశించుకోవాలని హితవు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కును ఓటర్లు తప్పక వినియోగించుకోవాలని వక్తలు సూచించారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావాలని సూచించారు. 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)...