Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 January 2026, 6:19 pm Posted by : ramakrishna

ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలి

. . . జాతీయ ఓటరు దినోత్సవంలో వక్తల పిలుపు

 

. . . ఓటింగ్ లో పాల్గొని భవితను నిర్దేశించుకోవాలని హితవు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కును ఓటర్లు తప్పక వినియోగించుకోవాలని వక్తలు సూచించారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావాలని సూచించారు. 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అంకిత్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అనంతరం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సందేశం వినిపించారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన ఓటు హక్కు ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాదిగా నిలుస్తోందని గుర్తు చేశారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఎన్నికల సంఘం పకడ్బందీగా ఎన్నికలు జరిపిస్తోందని, ప్రతీసారి వినూత్న పద్దతులను ప్రవేశపెడుతూ ప్రజలలో చైతన్యాన్ని పెంపోందిస్తుందని అన్నారు. ఇందులో భాగంగానే ఈసారి మై ఇండియా – మై ఓటు నినాదంతో ఓటర్లను చైతన్య పరుస్తోందని అన్నారు. స్వేచ్చాయుత  వాతావరణంలో మనకు నచ్చిన నాయకులను ఓటు ద్వారా ఎన్నుకునే అవకాశం కేవలం ఓటు హక్కు ద్వారానే సాధ్యమని సూచించారు. పలు దేశాలలో ఓటింగ్ లేకుండా నియంతృత్వ పాలన జరుగుతోందని, అందుకు భిన్నంగా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ భారత దేశంలో స్థానిక సంస్థలు మొదలుకుని పార్లమెంటు వరకు క్రమం తప్పకుండా పకడ్బందీగా ఎన్నికలు జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో, మంచి పాలకులను ఎన్నుకోవడంలో ప్రతి ఓటూ ఎంతో కీలకమైనదని అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. అప్పుడే ప్రజాస్వామ్యం మరింతగా పరిఢవిల్లుతుందని సూచించారు. స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం 1951లో అక్షరాస్యత తక్కువ ఉన్న సమయంలోనూ అందరినీ ఓటింగ్ లో భాగస్వామ్యం చేసేందుకు అప్పటి భారత ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ నేతృత్వంలో ఎలక్షన్ సింబల్ ను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని, రానున్న మున్సిపల్ ఎన్నికలను కూడా అదే స్పూర్తితో నిర్వహించాలని, ఓటర్లు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.18 ఏళ్ళు నిండిన వెంటనే ఓటరుగా నమోదు అయ్యేలా ఎలక్షన్ కమిషన్ యువతకు వెసులుబాటు కల్పించిందని సూచించారు. ఎన్నికలలో ఎలాంటి ప్రలోభాలకు ప్రభావితం కాకుండా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్ కుమార్ మాట్లాడుతూ, జాతి, కుల, మత, లింగ, వర్ణ భేదాలు, బడుగు, బలహీన వర్గాలు అనే తేడా లేకుండా పద్దెనిమిదేళ్లు దాటిన పౌరులందరికీ రాజ్యాంగం ఓటు హక్కును ప్రసాదించిందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతో ఓటర్లు తమకు నచ్చిన వారిని పాలకులుగా ఎన్నుకునే అవకాశం రాజ్యాంగం కల్పించినందున, ఈ హక్కును ఓటర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు ప్రాముఖ్యత, ఔన్నత్యం గురించి యువత ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్న సీనియర్ సిటిజన్లను, కొత్తగా నమోదైన యువ ఓటర్లను జిల్లా యంత్రాంగం తరపున జ్ఞాపికలు బహూకరించి సత్కరించారు. కొత్త ఓటర్లకు ఎన్నికల గుర్తింపు కార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సాయాగౌడ్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, నార్త్ తహసీల్దార్ విజయ్ కాంత్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, విద్యార్థిని, విద్యార్థులు, అధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొన్నారు.

 

 

The right to vote, which is very valuable in a democracy, must be exercised.
The right to vote, which is very valuable in a democracy, must be exercised.
The right to vote, which is very valuable in a democracy, must be exercised.