మోర్తాడ్, బతుకమ్మ :
భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కు ఓటు అని మోర్తాడ్ తహసీల్దార్ చేలుక కృష్ణ అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం జాతీయ ఓటర్ల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందాలని పేర్కొన్నారు. అనంతరం రెవెన్యూ ఇన్స్ పెక్టర్ రంజిత్ కుమార్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.