ప్రజల ప్రాణాలు తీస్తున్న రైస్ మిల్ ను సీజ్ చేయాలి
యాదవ సంఘం జిల్లా అధ్యక్షురాలు మంజుల యాదవ్ నిజామాబాద్ సిటీ బతుకమ్మ : మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామంలో నడి ఊరిలో నెలకొల్పిన ప్రైవేటు రైస్ మిల్ పై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని యాదవ సంఘం జిల్లా అధ్యక్షురాలు, బిఆర్ ఎస్ అర్బన్ ప్రెసిడెంట్ మంజుల యాదవ్ డిమాండ్ చేశారు. ధర్మోరా గ్రామంలో రైస్ మిల్ వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్న నేపథ్యంలో గ్రామస్తులతో కలిసి ఆమె జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డిపిఓ కార్యాలయం నుండి...