పరిశోధన ఫలాలను అందిపుచ్చుకోవాలి
ముప్కాల్, బతుకమ్మ: వ్యవసాయరంగంలో వస్తున్నపరిశోధన ఫలాలను అందిపుచ్చుకోవాలని రైతు నాయకుడు, వ్యవసాయ విశ్వవిద్యాలయం సలహా మండలి సభ్యుడు కోటపాటి నర్సింహనాయుడు రైతులకు సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ముప్కాల్ మండలం కొత్తపల్లిలో గురువారం ‘రైతు ముగింట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోటపాటి.. అధిక దిగుబడులు వచ్చే నూతన వంగడాలు, పురుగు మందులు, రసాయ ఎరువుల వాడకంలో మెలకువలు, పంటల మార్పడి తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు ఫిర్దోస్ సహనా, కల్పన,...