బీసీ రిజర్వేషన్ అమలు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే
నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 42శాతం బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్ లో చేర్చాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం బీసీ బంద్ లో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దుకాణాలు, వివిధ షాపింగ్ మాల్స్ ను బంద్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్ లో మానవహారం నిర్వహించారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటి ఆధ్వర్యంలో నిర్వహించిన...