నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 42శాతం బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్ లో చేర్చాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం బీసీ బంద్ లో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దుకాణాలు, వివిధ షాపింగ్ మాల్స్ ను బంద్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్ లో మానవహారం నిర్వహించారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని దండి వెంకట్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టం చేసే వరకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు న్యాయవాది బాస రాజేశ్వర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్, బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సబ్బని లత , బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాటల అనిల్ కుమార్, బీఎల్ టీయూ జిల్లా కార్యదర్శి మేకల రాజేందర్ జిల్లా నాయకులు ఆర్.మురళి, బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ బీడీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు తల్లారె సంజయ్ , బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు నాగయ్య, బీఎల్పీ జిల్లా కమిటీ సభ్యులు ఎస్.డి. సయ్యద్, నగర నాయకులు ఎం. అనిల్, రాధా బాయి తదితరులు పాల్గొన్నారు.
