కుల గణనకు జీఓ విడుదల చేయడం హర్షనీయం
నిజామాబాద్, బతుకమ్మ : కులగణన చేపట్టాలని ప్రభుత్వం అధికారికంగా జీవో నెంబర్ 18 జారీ చేసి విడుదల చేస్తూ తీసుకున్న నిర్ణయానికి నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేస్తుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస ఆంజనేయులు, బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కరిపే రవీందర్ అన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శీను ఆదేశాల మేరకు మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మహాత్మాజ్యోతిబాపూలే విగ్రహాలకు బుధవారం పూలమాలలు వేసి పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంగా...