Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 October 2024, 7:31 pm Posted by : ramakrishna

కుల గణనకు జీఓ విడుదల చేయడం హర్షనీయం

నిజామాబాద్, బతుకమ్మ : కులగణన చేపట్టాలని ప్రభుత్వం అధికారికంగా జీవో నెంబర్ 18 జారీ చేసి విడుదల చేస్తూ తీసుకున్న నిర్ణయానికి నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేస్తుందని  బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస ఆంజనేయులు, బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కరిపే రవీందర్ అన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శీను ఆదేశాల మేరకు  మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మహాత్మాజ్యోతిబాపూలే విగ్రహాలకు బుధవారం పూలమాలలు వేసి పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస ఆంజనేయులు, బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కరిపే రవీందర్ మాట్లాడుతూ కుల గణన కొరకు జీవో నెంబర్ 18 విడుదల చేస్తూ తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కులగణన కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి బసవరాజ్, జిల్లా యువజన అధ్యక్షుడు విజయ్, కార్యదర్శి విష్ణు, సంఘం నాయకులు దారం భూమన్న, శ్రీనివాస్, శ్రీలత, మురళి తదితరులు పాల్గొన్నారు.

The release of GO for caste enumeration is heartening