Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 6:26 pm Posted by : ramakrishna

వేగవంతంగా ఎస్ఐఆర్ ఫారాల నమోదు పూర్తి చేయాలి

 

. . . గడువులోగా ప్రక్రియ ముగించాలని ఎంపీడీవో అనంతరావు ఆదేశం

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో శనివారం కొనసాగుతున్న ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాల నమోదు ప్రక్రియను మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) అనంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేస్తూ, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్ఐఆర్ ఫారాల నమోదుకు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తమ వివరాలను నమోదు చేసుకున్నారు. విధుల్లో ఉన్న బీఎల్ఓలకు ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా నిర్వహించాలని ఎంపీడీవో సూచించారు. గ్రామ ప్రజల సౌకర్యార్థం ఇందల్వాయి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు, పెద్ద హనుమాన్ ఆలయం వద్ద రెండు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీ కార్యక్రమం లో ఇందల్వాయి సర్పంచ్ లోకాని గంగమణి గంగారాం, ఉప సర్పంచ్ మోత్కూరి శ్రీనివాస్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి భరత్, కారోబార్ పోచయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ జెగ్గ రాములు, బీఎల్ఓలు, జీపీఓలు తదితరులు పాల్గొన్నారు.