నెలాఖరు వరకు ఇంటింటి సర్వే వివరాలు ఆన్లైన్ లో నమోదు పూర్తి
జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్, బతుకమ్మ : అన్ని వర్గాల ప్రజల సామాజిక, ఆర్ధిక పరిస్థితుల విశ్లేషణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే వివరాలను ఆన్లైన్ లో నిక్షిప్తం చేయడం జరుగుతోందని, ఈ నెలాఖరు వరకు ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేస్తామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ధర్పల్లి తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో కొనసాగుతున్న ఆన్లైన్ నమోదు ప్రక్రియను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తున్న విధానాన్ని కలెక్టర్...