Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 December 2024, 9:49 pm Posted by : ramakrishna

రికార్డులు ఓకే…. సర్వేలోనే తేడా

. . . రికార్డుల పరంగా అవధూత నిర్మలనంద స్వామి భూమి
. . . అసైండ్ భూమి విషయంలో రెవిన్యూ లెక్కలు వేరు
. . . సర్వేలో సర్వేయర్ లేక్కలు వేరయా
. . . సహ చట్టంతో వెలుగులోకి సిర్పూర్ స్వామి భూమిలో ట్విస్టులు
నిజామాబాద్, బతుకమ్మ: పేదలకు, ఇతర అవసరాలు కలిగిన వారికి ప్రభుత్వం కేటాయించిన భూములు ( అసైండ్) లో లెక్కలు మాత్రం పక్కాగా ఉండటం అనేది ఎవ్వరిని అడిగినా చెబుతారు. ఎందుకంటే కేటాయించేది ప్రత్యేక సమయంలో అంతే గాకుండా వాటిని కేటాయించేది స్థానిక మండల మెజిస్ర్టేట్ స్దాయి అధికారి( తహసీల్థార్) లేదా, డివిజినల్ రెవిన్యూ అధికారి కాదు కూడదు అంటే జిల్లా కలెక్టర్ లు అసైన్డ్ భూములను కేటాయిస్తారు. ప్రభుత్వం పేదలకు ప్రభుత్వ భూములను పంచిపెట్టినప్పుడు స్థానిక మంత్రులు లేదా అసైండ్ ల్యాండ్ కమిటి చైర్మెన్ లుగా వ్యవహరించే స్థానిక శాసన సభ్యుల చేతుల మీదుగా భూములను పంచడం అనవాయితీగా వస్తుంది. భూ కేటాయింపుల సమయంలో సంబంధిత భూములు వివాదాలు లేకుండా పక్క మ్యాప్ లు, సర్వే చేసి హద్ధులు కేటాయించడం జరుగుతుంది. దాని వేనుక రెవిన్యూ, ల్యాండ్ సర్వే అధికారులతో పాటు అటవి శివారు ప్రాంతాలలో ఉంటే ఆటవి శాఖ అధికారులతో చర్చించి భూములను కేటాయించడం అనేది ప్రతిసారి అన్ని ప్రభుత్వాలలో జరిగే తంతు….
కాని ఒకప్పటి నిజామాబాద్ ( ప్రస్తుత మోపాల్) మండలంలో దశాబ్ధల క్రితం కేటాయించిన అసైన్డ్ భూముల వ్యవహరంలో తేడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. నిజామాబాద్ నగరం విస్తరించడం, నుడా పరిధిలోకి రావడంతో మోపాల్ మండలంలో భూముల లెక్కలు మారిపోతున్నాయి. అసైన్డ్ శిఖం, వక్ప్, సీలింగ్, ఇనాం భూములు, దేవదాయ భూములకు రాత్రికిరాత్రే యజమానులు మారిపోతున్నారు. అందుకు కారణం రెవిన్యూ లేదా ల్యాండ్ సర్వే డిపార్ట్ మెంట్ అధికారులే. దశాబ్ధాల క్రితం కేటాయించిన భూములలో కబ్జా రాయుళ్లు పాగా వేస్తుంటే వారికి వెన్ను , దన్నుగా వ్యవహరిస్తున్నారు. అన్నేం పుణ్యం ఎరుగని ఒక సాదువు లోక కళ్యాణార్థం ఆశ్రమం కట్టుకుని జీవించేందుకు 40 ఏళ్ల క్రితం కేటాయించిన భూమి విషయంలో రెండు ప్రభుత్వ శాఖల వ్యవహర శైలిపై పెద్ధ ఎత్తున దుమారం చెలరేగింది. ఏకంగా ఎమ్మెల్యేలు చెప్పిన వారిని పక్కదోవపట్టిస్తున్న వైనం సమాచారం హక్కు చట్టం ద్వారా బట్ట బయలైంది.

The records are ok....the difference is in the survey itself
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం ముదక్ పల్లికి చెందిన అవదూత నిర్మల నంద స్వామికి ఉమ్మడి రాష్ర్టంలో 1984లో అనాటి ప్రభుత్వం అదేశాల మేరకు అనాటి జిల్లా కలెక్టర్ సిర్పూర్ గ్రామ శివారులోని సర్వే నంబర్ 602/110,602/111 లో 5 ఎకరాల భూమిని కేటాయించింది. దాని ప్రకారం ఇప్పటికి స్వామికి దరణి పోర్టల్, అడంగల్ పహనీ, 22 ఎ రిజిస్టర్ లో అయనే యజమానిగా రికార్డులు చెబుతున్నాయి. అందుకు అనుగుణంగా గత ప్రభుత్వం హయం నుంచి రైతుబంధు కూడా సంబందిత స్వామికి ప్రభుత్వం జమ చేస్తునే వస్తుంది. కాని గత ప్రభుత్వం హయంలో మొరం మాఫీయా అక్కడ సిర్పూర్ శివారులోని నందిగుట్ట ప్రాంతంలో గుట్టలను స్వాహా చేసింది. అక్కడ మొరంను తరలించగా చదును చేసిన భూమిపై కన్నేసి కబ్జాకు దిగింది. దానికి పక్కనే అప్పటికే వర్షాదార పంటలను సాగు చేసిన స్వామిభూమిపై పడి దానిని చెరబట్టింది.
మొరం మాఫీయా అక్కడ కొత్త తరహాలో కబ్జాకు వ్యూహం పన్నింది.అందుకు రెవిన్యూ, ల్యాండ్ సర్వే అధికారులను పావులుగా వాడింది. అవదూత నిర్మలనంధ స్వామికి సర్వే నంబర్ 602/110,602/111 లో 5 ఎకరాల భూమిని కేటాయించింది. కాని అక్కడ సర్వే నంబర్ 602/112,602/113,602/114,602/115 భూమిలో కబ్జా ఉన్నామని కొత్తగా నాటాకానికి తెరలేపారు. కానీ సంబంధిత సర్వే నంబర్ లో ధరణి పోర్టల్, అడంగల్ పహనీ, 22ఏ రిజిస్టర్ లో ఉన్నవారిని కాదని కొత్త పేర్లు తెరపైకి తెచ్చారు. రెవిన్యూ రికార్డులలో సర్వే నంబర్ లలో 602/112,602/113,602/114,602/115 లో లేని యాజమానులను పేర్లను ల్యాండ్ సర్వే అధికారులు మాత్రం సర్వేలో ఉన్నారని ఇవ్వడం అందులో ట్విస్టు. ఇందులో సమాచార హక్కు చట్టం ప్రకారం ల్యాండ్ సర్వే అధికారులను సర్వే తాలుకు రిపోర్టులు ఇవ్వాలని కోరగా స్థానిక మండల సర్వేయర్ అధికారి తన రిపోర్టు ఇవ్వకుండా ప్రజా సమాచార అధికారి (ఎపిఓ)కి ( కబ్జాదారు, యజామాని) చర్చించి నిర్ణయం తీసుకుంటారని చేప్పటంతో సర్వే చేసి హద్ధులు చూపలేదని సహ చట్టం ద్వారా అడిగిన సమాచారంకు జవాబు ఇచ్చారు. తరువాత ఎపిసోడ్ లో మాత్రం స్థానిక సర్వేయర్ మాత్రం ల్యాండ్ సర్వే సహాయ సంచాలకులకు ఇచ్చిన రిపోర్టు తాలుకా వివరాలను సహ చట్టం ద్వారా యజమానిని కోరగా అందులో తాము సర్వే చేశామని అక్కడ దరాఖాస్తు దారు పోజిషన్ లేరని రిపోర్టు ఇవ్వడం విశేషం.

The records are ok....the difference is in the survey itself