అధికారుల నిర్లక్ష్యమే కారణం
బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : ఆనంద్ నగర్ లో మురుగు కాల్వలో పడి చనిపోయిన అనన్య కుటుంబాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పరామర్శించారు. స్థానికులతో, అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. నాలాలో పడి బాలిక చనిపోవడం బాధకరమన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి లోతట్టు ప్రాంతాలు, డ్రైనేజీలు, రోడ్లు తదితర సమస్యలపై దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్, అధికారులకు సూచించినా పట్టించుకోలేదని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నిండుప్రాణం పోయిందన్నారు. నగర సమస్యల పై కలెక్టర్...