Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 June 2025, 10:27 pm Posted by : ramakrishna

వివాహేతర సంబంధమే కారణం

  • కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

 

కామారెడ్డి, బతుకమ్మ : వివాహేతర సంబంధమే పంచాయతీ కార్యదర్శి హత్యకు కారణమని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. చిన్న కొడప్ గల్ కు గ్రామానికి చెందిన  లింగంపేట మల్కయ్యకు వివాహమైంది. మల్కయ్య నాలుగు నెలల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో తన భార్యతో పంచాయతీ కార్యదర్శి దారావత్ క్రిష్ణకు తన భార్యతో వివాహేతర సంబంధం ఉందనే విషయాన్ని తెలసుకున్నాడు. దీంతో మల్కయ్య తన భార్యతో నిత్యం గొడవపడేవాడు. క్రిష్ణను ఎలాగైనా హతమార్చాలనే ఉద్దేశ్యంతో తన భార్యతో ఈనెల 5న క్రిష్ణకు ఫోన్ చేయించి ఇంటికి రప్పించాడు. అక్కడ మరో ఇద్దరు ఎర్రన్నోళ్ల బాలరాజు, లింగంపేట మల్కయ్యతో కలిసి క్రిష్ణను గొడ్డలి, కత్తి, ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశారు. అనంతరం క్రిష్ణ డెడ్ బాడీని రెడ్డి చెరువులో పడేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు  తరలించారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన వస్తువులు, రెండు బైక్ లు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్, ఎస్సై రాజు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.