Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 October 2024, 11:58 am Posted by : ramakrishna

గిరిజనుల హక్కుల సాధన బీజేపి తోనే సాధ్యం

కామారెడ్డి, బతుకమ్మ: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండు ఎదుట గిరిజన మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ గిరిజన మోర్చ రాష్ర్ట అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ.. ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకి దక్కిందన్నారు. ప్రతి లంబాడా సోదరులు బీజేపీ లో సభ్యత్వం పొందాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని మారుమూల ప్రాంతంలో సైతం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుకుగా సాగుతోందన్నారు. ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసీలు బీజేపీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారన్నారు.

The realization of tribal rights is only possible with BJP